మా నాన్నగారు

శుభోధయం... రోజు, మా జీవితంలో మరపురాని ఒక సంఘటన జరిగిన రోజు... సరిగ్గా రెండు సంవత్సరాల క్రిందట ఇదే రొజు మా నాన్నగారు మానుండి శాశ్వతంగా దూరమయిన రోజు..ఆరోజు నేను స్కూల్ లో మంచి బిజీగా వున్న సమయం... ఫోన్ కాల్ మావారినుండి....అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి,పర్మిషన్ తీసుకుని రెడీగా వుంటే తను నన్ను పికప్ చేసుకుని, రత్నాచల్ కి బయలుదేరాలని...సిరిపురం నుండి,రైల్వే స్టేషన్ కి వచ్చేలోగా అంతా ఐపోయింది అని చెల్లి ఫోన్........................ జ్ఞాపకాలలో ఒక చిన్న మరపుకి రాని,మరువలేని,ఆచరణీయయోగ్యమయిన ఒక చిన్న సంఘటన.............................
నాకు చిన్నతనం నుండీ పుస్తకాలు అంటే ఏదో తెలియని మమేకం... చిన్న చిరిగిన కాయితం ముక్క ఐనా నాకు అపురూపం..నాన్నగారు ట్రైన్ కి వెళ్తూ ఇచ్చిన చిల్లర తో మొదటగా నేను కొన్నది......... ఆంద్రప్రభ వీక్లీ...వేంకటేశ్వరస్వామి వారి ముఖచిత్రం... అలవాటు మా నాన్నగారిదే..ఎన్నో బుక్స్ తెచ్చేవారు..అది,ఇది అని కాదు..సాంఘిక,డిటెక్టివ్,భక్తి...ఇలా చదవదగినవి అన్నీ..అందుకే చెప్తాను సగర్వంగా నా బెస్ట్ ఫ్రెండ్స్.............నా పుస్తకాలు.....ఉదయం నిద్ర ఐదు గంటలకు లేచి,కాలకృత్యాది పనులు పూర్తి చేసుకున్న తర్వాత నా కేరాఫ్ అడ్రస్.......... గౌతమీ గ్రంధాలయం,,,పోస్టాఫీసు వీధి,,రాజమండ్రి...సాయంత్రం స్కూల్ నుండి రాగానే అమ్మ పెట్టింది తిని మరల ఒక గంట లైబ్రరీ..........ఇంక విషయం లోకి వచ్చేస్తాను........
ఒక రోజు మాస్కూల్ కి ఎందుకు శెలవు ఇచ్చారో గుర్తు లేదు కాని మధ్యాహ్నం వదిలేశారు..సహజంగా ఇంటికి వెళ్ళేనేను,,మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వరండాలో బుద్దిగా నా దగ్గర వున్న(నాన్నగారు లైబ్రరీ నుండి తెచ్చిన)బుక్ చదువుతూ వుండిపోయాను..టైము చూసుకోలేదు.".సాయంత్రం ఐంది అమ్మా,ఇంటిదగ్గర కంగారు పడతారు" అని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చెప్పేంతవరకు... ఇంటికి పరుగెత్తాను...అప్పటికి అమ్మ బయట, నాన్నగారు లోపల మంచం మీద....నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టిన నన్ను చూసి అమ్మ కామ్ గా లోపలికి వెళ్ళారు..నేను వెనకే వెళ్ళాను..ఇంకేముందీ.......పెద్ద పులిలా నాన్నగారు ఎర్రబడ్డ కళ్ళతో.........ఏయ్, బెల్ట్ ఇటు ఇయ్యి అని అమ్మని పిలిచారు..నేను మౌనంగా నిలిచివున్నాను...బెల్ట్ పట్టుకుని నా దగ్గరకు రా అని పిలిచారు............కొడతారు అని అనుకున్న నాకు సడన్ షాక్,తన అరచెయ్యి చాపి "కొట్టు" అన్నారు......షాకే కదండీ..............అప్పుడు తెలిసింది, నా కోసం ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారని,స్కూల్ మధ్యాహ్నంవదిలిపెట్టినా ఎక్కడికీ వెళ్ళని నాకోసం వాళ్ళు ఎంత కంగారు పడ్డారో అని..... మళ్ళీ అలా చెయ్యను అని డిసైడ్ అయిపోయాను అప్పుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే........................శనివారం ఉదయం సాక్షి టి.వి.లో ఒక కార్యక్రమం...............పిల్లలను దండించే తల్లి,తండ్రులు,ఉపాధ్యాయులు,,, పిల్లల పరి రక్షణ హక్కులు.చట్టాలు..................... సినీనటి జీవిత,మరికొందరు వాఖ్యానం.............విన్న తరువాత నేనూ ఒక ఉపాధ్యాయురాలిగా, ఇన్ చార్జ్ గా పది సంవత్సరాల నా అనుభవం,పిల్లలతో నాకున్న అనుబంధం,,అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నా అభిప్రాయం వ్రాదామనుకున్నాను..కాని,ఈరొజు మా నాన్నగారిని గుర్తుచేసుకునే బాగం లో సంఘటన ని ఒక తండ్రిగా నా మీద తనకున్న నమ్మకాన్ని ఎలా తెలియజేసారు, నారాక ఆలస్యం ఐనందుకు వాళ్ళుపడిన ఆందోళన నాకు చెప్పకనే ఎలా చెప్పారు అన్న విషయాన్ని ప్రతి తల్లి,తండ్రికి తెలియచేయాలన్న నా ఉద్దేశ్యం.... మా నాన్న గారు అంటే నాకు గర్వం .. ఆయన ఎంత అర్ధరాత్రి డ్యూటీ నుండి వచ్చినా మాకు తినిపించి,మాతో కొంచెం సేపు కారమ్స్ ఆడి  నిద్రపోయేవారు. ఆటలో గెలుపు మీద దృష్టితో పాటు పట్టుదల గా ఎలా కాయిన్స్ కొట్టాలో అలా      

.

కామెంట్‌లు

  1. చక్కని తండ్రి. బావుంది.

    వర్డ్ వెరిఫికేషన్ తీసివెయ్యండి.

    ఎరుపు అక్షరాలు చూడటానికి అంత బాగోవు.

    రిప్లయితొలగించండి
  2. చక్కగా రాసారు.
    మనుషులు ఎల్లప్పుడు మనతో ఉండరు, కానీ వారి ఆలోచనలు, జ్ఞపకాలు ఎప్పుడూ మనతొనే

    రిప్లయితొలగించండి
  3. శరత్ గారు,,ధన్యవాదాలు..మీ సూచనలని తప్పకుండా పాటిస్తాను

    రిప్లయితొలగించండి
  4. సావిరహేగారు,,ధన్యవాదాలు..తారగారు,మీకు కూడా.

    రిప్లయితొలగించండి
  5. నాన్న మనసు ఘనీభవించిన నవనీతం అని పిల్లలు అర్థం చేసుకుంటే చాలు. సాగరహృదయంతో,హిమవన్నగనీడ పరచి తన బిడ్డలను కాపాడుకుంటాడు తండ్రి.నేను మరువలేని నా తండ్రి జ్ఞాపకాలను మరింత పునర్జీవింప చేసారు.విధివశాత్తు తండ్రిని కోల్పోయినా వారి స్ఫూర్తితో జీవితాన్ని ఫలప్రదం చేసుకోవడమే పిల్లల కర్తవ్యం.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం