బ్రతకడమా, జీవించడమా?

ఏమిటిది పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారు కద.........ఒక్కసారి ఆలోచించండి.....ఇప్పుడు అర్ధమయిందా ఎందుకు అడిగానో.........సరే,నేనే చెప్తాను...


బ్రతకడానికి,జీవించడానికి..నక్కకి,నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది....అందరం బ్రతుకుతున్నాము.ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండి,రాత్రి పడుకునేవరకు...మరి ఇంకేమి కావాలండి? జీవించడం.....ఎలా? జీవించడానికి ఒక అర్ధం,పరమార్ధం కావాలి..అర్ధం అంటే నేనిక్కడ మీరు అనుకుంటున్నదే చెప్తున్నాను..మనిషికి కాసింత కళా,పోషణా ఉండాలి అంటారు రావుగోపాలరావుగారు ముత్యాల ముగ్గు సినిమాలో..మరి ఆ రెండూ ఎక్కడ లభిస్తాయండి అని అడిగితే డబ్బు కలవారి జవాబుకి,డబ్బు లేనివారి జవాబుకి వున్న తేడానే.....నక్కకి,నాగలోకానికి వున్నంత.. డబ్బు అంటాడు ఉన్నవాడు..చింకిచాప అంటాడు లేనివాడు...ఇదేమిటి అంటే......వ్యక్తి తనకున్న అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవడం అన్నమాట..ఎవరి స్థానాల్లో వారు జీవించడానికి చేసే ప్రయత్నం అన్నమాట...సరే ఎలానూ డ్బ్బు విషయం వచ్చింది కద.ఒక రహస్యం చెప్పనా..ఆ,ఇది అందరికీ తెలిసిందే అంటారా.....ఐతే ఓ.కే...



డబ్బు కొండమీది కోతినయినా తెస్తుందండి..మనిషిని అధః పాతాళానికి దిగిజారుస్తుంది... .. అధికారం కూడా అంతే...ఈ మధ్య నేను గమనించిన కాదు,కాదు,,కళ్ళారా చూసిన విషయాలు.....మాకు తెలిసిన ఒక కుటుంబంలో కొత్తగా వారి అబ్బాయికి పెండ్లి ఐంది..ఆ అబ్బాయి అత్తగారు ఆస్తి,అంతస్తు,వగైరాలు అన్ని పుష్కళంగా వున్నవారు..ఇంక చెప్పేదేముంది? కోడలు పిల్ల ముందు అబ్బాయికి అమ్మా,నాన్న కనబడడం లేదండి...ఇంకా చెప్పమంటారా..............మేము స్టాఫ్ మెంబర్స్ అందరు కలసి ఒక అయిదు నక్షిత్రాల హోటల్ కి లంచ్ కి వెళ్ళాము..మా ఎదురుగ వున్న టేబుల్ దగ్గర ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని వున్నారు.. ఇద్దరూ యాభై సంవత్సరాలు దాటినవారే...ఏ,,బి అనుకుందాము..అది బఫె పద్దతి..ఏ అన్నవాడు బి ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాడు..వెయిటర్ ని పిలిచి సార్ కి ఏది కావాలంటే అది దగ్గరుండి వడ్డించమన్నాడు... అరడజను బీర్ బాటిల్స్ ఐసుముక్కలు రెడి..ఇంక అడగకండి..ఒక గ్లాసు మందు,,ప్లేట్లు,పేట్లు చికెను ముక్కలు,రొయ్యలు,మటన్ ముక్కలు............భయంతో నా ముందు వున్న భోజనం కూడా ముట్టుకోబుద్ది కాలేదు.. ఒరేయ్,చచ్చిపోతావురా అని అరవాలన్నంత భయం...


ఐతే ఇంకో వివిత్రం ఏమిటో తెలుసా______ ఎదుటివాడికి ఇంత ప్రేమగా తినిపిస్తున్న వాడు ఏమి తింటున్నాడో తెలుసా..... సింపుల్ గా ఫ్రూట్ సలాడ్...చూసారా........ఇదండి కూసింత కళా,పోషణా...ఎంత జీవిస్తున్నాడండి మనిషి....ఎక్కడ మొదలయ్యి,ఎక్కడ ఆగిందండి....లేదు,లేదు ..ఆగలేదు... ఇది ఇంతే....సాగుతూనే ఉంటుంది...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం