....... ధ్యానం. ......

మెడిటేషన్ క్లాసులు తీసుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాను....ఆరోగ్యం కోసం అని కొందరు,ప్రశాంతత కోసం అని మరికొందరు చెప్తే, జ్ఞానం కోసం అని ఒకరిద్దరు చెప్తున్నారు. అయితే జన్మల గురించి కూడా వివరిస్తున్నారు, ఎవరికి తెలిసినట్లు వారు..మరుజన్మ వద్దు అని,ఎమైనా కోరికలు వుంటే ఇప్పుడే తీర్చేసుకోవాలని, ఇలాంటి అపోహలు కూడా వున్నాయని తెలుస్తుంది...



ధ్యానం మనిషిని తప్పుదారి పట్టించదు
భాద్యతలను మరిపింపదు.
ధ్యానం ఆరోగ్యకరమయిన ఆలోచనా సరళిని పెంచి,
జీవితాన్ని మార్చగలిగిన ఒక యోగం.
ధ్యానం మౌనాన్ని నేర్పుతుంది
మాటలనూ నేర్పుతుంది.
ప్రశాంతత ఇస్తుంది,ప్రకృతిని పరిచయం చేస్తుంది.
మౌనమూ ధ్యానమే,మంత్రపఠనమూ ధ్యానమే,
ధ్యానం ప్రేమను నేర్పుతుంది,
ప్రేమ తత్వాన్ని పెంచుతుంది.
కామ,క్రోధ,మద, మాత్సర్యాలని చంపుతుంది,
మంచిని పెంచుతుంది.
మరవ వద్దు భాద్యతలను,విడువవద్దు ధ్యానాన్ని,
ఒయాసిస్సులకై పరుగులొద్దు
నిన్ను నీవు తెలుసుకొని మసలు.
మన ప్రయత్నమ్ మనది
ప్రతి ఆనందము మనదే. ధ్యానం ఆరోగ్యకరమయిన ఆలోచనా సరళిని పెంచి,

కామెంట్‌లు

  1. మీ బ్లాగు లో ఆధ్యాత్మికం చాల బాగుంది.ధ్యానం గురించి బాగారాసారు.దిని మీద ఇంకా రాయండి మాలాతివారికి ఏంటో సంతోషం అవుతుంది.
    లక్ష్మీ రాఘవ

    రిప్లయితొలగించండి
  2. ఈరోజు ప్రమదావనంలో ప్రియ మరణం గురించి తెలిసాక, ధ్యానం గురించి మరింత మనసు పడుతున్నాను. మనసును కట్టి ఇదంతా సహజమే అని ఎదగాలని అనుకుతున్నాను..మీరు చెప్పబోయే విషయాలకై కాచుకున్నాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం